లక్షణాల దశలోనే కుష్టు వ్యాధిని నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

లక్షణాల దశలోనే కుష్టు వ్యాధిని నివారిద్దాం

Published Fri, Jan 31 2025 12:56 AM | Last Updated on Fri, Jan 31 2025 12:56 AM

లక్షణాల దశలోనే కుష్టు వ్యాధిని నివారిద్దాం

లక్షణాల దశలోనే కుష్టు వ్యాధిని నివారిద్దాం

నాగర్‌కర్నూల్‌ క్రైం: లక్షణాల దశలోనే కుష్టు వ్యాధిని గుర్తించి.. చికిత్స చేయిస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో గురువారం విద్యార్థులకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. కుష్టు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. లక్షణాల దశలోనే వ్యాధిని గుర్తించి 6 నుంచి 12 నెలలపాటు చికిత్స అందిస్తే అంగవైకల్యం బారిన పడకుండా చేయవచ్చన్నారు. మహాత్మా గాంధీ కుష్టు వ్యాధిగ్రస్తులను చేరదీసి సేవలు అందించారని.. ఆయన వర్ధంతి రోజున కుష్టు వ్యాధి వ్యతిరేక దినంగా పాటిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యాధి నిర్మూలనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. వెంకటదాసు, డీపీఓ రేణయ్య, డిప్యూటీ పారామెడికల్‌ అధికారులు సుకుమార్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement