ఉమ్మడి జిల్లాకు కావాల్సిన వాటిపై విన్నవించాం..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర మంత్రులను పలుమార్లు కలసి విజ్ఞప్తి చేశాం. ప్రతిసారి తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ సారైనా తగిన మేరకు కేటాయింపులు జరపాలని విన్నవించాం. గద్వాల–డోర్నకల్ మార్గానికి ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరాం. పాలమూరు వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్
నిధులు వస్తాయని ఆశిస్తున్నాం..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిపాదించిన రైల్వే లైన్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తుందన్న నమ్మకం ఉంది. మహబూబ్నగర్–తాండూరు రైల్వే లైన్తో పాటు గద్వాల–డోర్నకల్ రైలు మార్గం నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ఇప్పటికే ఉన్న రైల్వేలైన్లు, స్టేషన్ల ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి.
– డీకే అరుణ, ఎంపీ, మహబూబ్నగర్
●
Comments
Please login to add a commentAdd a comment