అచ్చంపేట రూరల్: బల్మూరు మండలం మైలారంలో మైనింగ్ తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశ్యానాయక్ మాట్లాడుతూ.. పర్యావరణానికి విఘాతం కలిగించే మైనింగ్ తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా చేపడుతున్న మైనింగ్ తవ్వకాలను ఆపకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శంకర్‌నాయక్, నిర్మల, సయ్యద్, శివకుమార్, రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment