శెభాష్.. నారాయణమ్మ
పాడి పరిశ్రమతో రాణింపు ● మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ముందుకు..
నారాయణపేట: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన.. కేవలం వంటింటికే పరిమితం కాకూడదన్న తలంపు.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశయం ముందు కష్టాలు, అలసట పటాపంచలు అయ్యాయి. ఫలితంగా తనతో పాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నారాయణపేటకు చెందిన కాకర్ల నారాయణమ్మ. పట్టణంలోని సింగార్‌బేష్‌కు చెందిన కాకర్ల నారాయణమ్మ 1983లో భర్త కాకర్ల భీమయ్య ప్రోత్సాహంతో రూ.5 వేల పెట్టుబడితో రెండు గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంతింతై.. వటుడింతై’ అన్న చందంగా ఆ వ్యాపారం ప్రస్తుతం 30 గేదెలతో నెలకు రూ.1.20 లక్షలు ఆదాయం సంపాదిస్తూ.. ఆదర్శంగా నిలిచింది. నిత్యం కష్టజీవిగా పరితపిస్తూ 42 ఏళ్లుగా గేదెలతో చిన్నపాటి కుటీర పరిశ్రమగా మార్చుకుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తానూ సంపాదించాలనే తాపత్రయంతో పాల వ్యాపారంలో రాణిస్తోంది. తనతోపాటు ఆరుగురికి ఉపాధిని కల్పిస్తోంది. గేదెల నుంచి పాల దిగుబడితో రోజుకు రూ.4వేల ఆదాయం ఆర్జిస్తోంది. ఆమె ఉత్తమ పాడి రైతు అవార్డును సైతం అందుకుంది.
రుణం
ఇవ్వకపోయినా..
పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, ఆ ఆర్థిక సహాయానికి కాకర్ల నారాయణమ్మ ఇంత వరకు నోచుకోలేదు. ఆమె తమ స్వయం కష్టార్జితంతోనే పాడి పరిశ్రమను అంచెలంచెలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారే తప్ప ఏ బ్యాంకు రుణ సదుపాయం అందిస్తామని ముందుకు రాలేదు. ఎంతో శ్రమిస్తున్న ఈ మహిళకు పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, బ్యాంకర్లు ఆర్ధిక సహాయం అందించి మరింత చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళల సమస్యల పరిష్కార వేదికలు
కొడుకు పేరిట ట్రస్టు
ప్రతిఏటా నిరుపేద జంటలకు బంగారు పుస్తె, మెట్టెలు అందిస్తూ.. వృద్ధులకు చీరలు ఉచితంగా పంపిణీ చేస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది నారాయణమ్మ. ఈమె కుమారుడు కాకర్ల సురేష్ హఠాన్మరణంతో కలత చెందారు. ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ పాడిపరిశ్రమలోఎంతో శ్రమించేవాడు. కొడుకు జ్ఞాపకార్థం సురేష్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తోంది. అలాగే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కౌన్సిలర్‌గా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తోంది. ప్రతిఏటా వేసవిలో జిల్లాకేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తోంది.
ఫ్యామిలీ కోర్టు, మహిళా న్యాయ స్థానం, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా పోలీస్ స్టేషన్, సఖి కేంద్రం, భరోసా కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment