ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
● రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
వంగూరు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం వంగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులంతా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడం, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశాలపై ఉపాధ్యాయులతో ఆరా తీశారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ కమిషన్ సభ్యులు జ్యోత్స్న శివారెడ్డి, విశ్వేశ్వర్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు ఉన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు
నాగర్‌కర్నూల్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే అసలైన అభివృద్ధి అని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళల సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతి ఇంట్లో ఆడ, మగ పిల్లలను సమానంగా చదివించాలని సూచించారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో మహిళలకు తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, డీఎంహెచ్‌ఓ స్వరాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment