వైభవంగా వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ప్రాతారాధన, సుప్రభాతం, అర్చన, సేవాకాలం, బాలభోగ నివేదన, హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి.. రాజభోగ నివేదన చేశారు. సాయంత్రం మత్స్యంగ్రహణం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, రాజశేఖర్, వలంటీర్లు భాస్కరాచారి, చెన్నకృష్ణారెడ్డి, భరత్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment