దైవచింతనతో మెలగాలి
కల్వకుర్తి రూరల్: సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవచింతనతో మెలగాలని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. కల్వకుర్తి మండలం యంగంపల్లి శ్రీసీతారామ, ఆంజనేయ, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగి 41 రోజులైన సందర్భంగా బుధవారం ప్రత్యేకంగా హోమాలు, పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నజీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో భక్తిభావం పెరిగిందన్నారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించడం, నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సమాజంలోని ప్రజలందరూ కులాలకు అతీతంగా దైవభక్తి కలిగి ఉండాలని సూచించారు. అనంతరం భక్తులు చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment