
కిలోకు వంద గ్రాములు తరుగు..
నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాల్లో పెద్దఎత్తును మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మాంసం విక్రయదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను నిర్ణయించడమే కాకుండా తాము చెప్పినట్లు, తాము తూకం వేసిందే సబబు అన్నట్లుగా దౌర్జాన్యాలు సాగిస్తున్నారు. కిలోకు సరాసరిగా వంద గ్రాముల చొప్పున తరుగు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు మారు మాట్లాడకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వినియోగదారలు మున్సిపల్‌లో గాని, సంబంధిత శాఖ అధికారులకు గాని ఫిర్యాదు చేసినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
పట్టించుకోవడం లేదు..
మాంసం విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. మటన్ మార్కెట్‌లో గొర్రె మాంసంను పొట్టేలు మాంసంగా చిత్రీకరించి అమ్ముతున్నారు. ఇంతే కాకుండా అనారోగ్యం కలిగిన మేకలు, గొర్రెలను కోసి వినియోగదారులకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఏటిగడ్డ శ్రీనివాసులు, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్‌లో చేపల విక్రయం
Comments
Please login to add a commentAdd a comment