కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
నాగర్‌కర్నూల్ క్రైం: కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ సర్వే నిర్వహించాలని సూచించారు. సమాజంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించి.. సత్వరమే చికిత్స అందించడంతో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి సంవత్సరం ఎల్‌సీడీసీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమన్నారు. కాగా, ఎల్‌సీడీసీ సర్వేకు సంబంధించిన డబ్బులు వచ్చాయని.. సర్వేను విజయవంతంగా నిర్వహించిన వెంటనే సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. రోజు వారీగా సర్వే రిపోర్టును సంబంధిత అధికారులకు మధ్యాహ్నం 12 గంటలలోగా సమర్పించాలని సూచించారు.
ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష
వెల్దండ: మండలంలోని గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆదివారం విద్యార్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 60 సీట్లు ఉండగా.. 394 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ పర్దీప్‌కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు 344 మంది హాజరు కాగా.. 50 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.
వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలి
కల్వకుర్తి రూరల్: ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీల్లో అధిక జనాభా ఉన్న మాదిగలకు 70 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు వచ్చాక కూడా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయాలని చూడటం దారుణమన్నారు. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో పెడతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. శిబిరంలో డప్పు వాయించి నిరసన తెలిపారు. పరశురాం, వీరస్వామి, మాజీ కౌన్సిలర్ రామరాజు, భాస్కర్, జంగయ్య, కిరణ్, లాలయ్య, కృష్ణ, శేఖర్, మల్లేష్ పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు సమష్టి పోరాటాలు
నాగర్‌కర్నూల్ రూరల్: రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్నివర్గాలు సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలని ఆవాజ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన, విధ్వేష రాజకీయాలు పెంచి పోషించడం తగదన్నారు. సమావేశంలో నాయకులు అబ్దుల్లా ఖాన్, నిజాం, అమీద్, సలీం, అనీష్, వహీద్, జమాలుద్దీన్, పాషా, రహీం ఉన్నారు.
కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
Comments
Please login to add a commentAdd a comment