చెత్త‘శుద్ధి’ కరువు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతగానే నిర్వహణ
● తడి, పొడి చెత్తను వేరు చేయడంలో వీడని నిర్లక్ష్యం
● నామమాత్రంగా మారిన డంపింగ్ యార్డులు
● శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా కాల్చివేత
● ఆదాయం కోల్పోతున్న పురపాలికలు
నాగర్‌కర్నూల్ శివారు డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ డబ్బాలు
అచ్చంపేట రూరల్: పట్టణం విస్తరిస్తోంది. జనాభా పెరుగుతోంది.. ప్రజల అవసరాలు పెరిగి.. చెత్త, వ్యర్థాల లభ్యత అధికమైంది. కానీ, అందుకు తగ్గట్టుగా డంపింగ్ యార్డు సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. అచ్చంపేట నగర పంచాయతీగా ఉన్నప్పుడే పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చౌటపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. పట్టణం నుంచి సుమారు 7 టన్నుల చెత్త 9 మినీ ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరించి చౌటపల్లి శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే తడి, పొడి చెత్త కలిపి సేకరిస్తుండగా.. ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టడం లేదు. పైగా చెత్తను కాల్చివేస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తడి చెత్తను వర్మీ, విండ్రో కంపోస్టు ఎరువుగా మార్చి మున్సిపల్ పరిధిలో పెంచుతున్న ప్రకృతి వనాల్లో మొక్కలకు ఎరువుగా వినియోగించవచ్చు. కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అమలు కావడం లేదు. అలాగే స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా... కిందిస్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. అచ్చంపేట మున్సిపాలిటీలో స్థానిక అధికారులు, సిబ్బంది ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఒక దశలో అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తుండటంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నా.. జరిమానాలు విధించిన దాఖలాలు లేవు.
పట్టణ జనాభాకు అనుగుణంగా చెత్త సేకరణకు ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు అన్ని కాలనీల్లో చెత్త సేకరణ చేసి తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు పంపుతున్నాం. ప్రతిరోజు సుమారు 7 క్వింటాళ్లకు పైగా తడి, పొడి చెత్త వస్తుంది. కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నాం. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
– యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
అచ్చంపేట డంపింగ్ యార్డులో నిల్వ ఉంచిన చెత్త
చెత్త‘శుద్ధి’ కరువు
చెత్త‘శుద్ధి’ కరువు
Comments
Please login to add a commentAdd a comment