వివరాలు 1లో u
పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా రాయాలి
● జిల్లాలో పరీక్షల నిర్వహణకు
అన్ని ఏర్పాట్లు పూర్తి
● హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
● గ్రేడింగ్ విధానం కాకుండా
మార్కులు ఇవ్వనున్న ప్రభుత్వం
● గతంతో పోలిస్తే ఈసారి
మెరుగైన ఫలితాలు సాధిస్తాం
● ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో
డీఈఓ రమేష్‌కుమార్
నాగర్‌కర్నూల్: పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కుమార్ సూచించారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలకు గాను 510 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. వారితో పాటు 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 62 మంది డిపార్ట్‌మెంట్, 36 మంది కస్టోడియం అధికారులతో పాటు నాలుగు స్పెషల్ స్క్వాడ్స్ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయని తెలిపారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై డీఈఓ రమేష్ కుమార్ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
డీఈఓ
రమేష్‌కుమార్
గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లా 23వ స్థానంలో నిలిచింది. ఈసారి మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. గతంలో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో విద్యార్థులు రాణించలేకపోవడంతో ఫలితాలపై ప్రభావం చూపాయి. ఈసారి విద్యార్థులు ఫిజిక్స్, మ్యాథ్స్‌పై పూర్తి పట్టు సాధించేందుకు 40 రోజులపాటు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలి. విద్యార్థులకు ఎవరికై నా సందేహాలు ఉంటే 77027 75340, 98850 17701 నంబర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి..
విద్యార్థులు పాఠశాలలతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబడవు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక మహిళా, ఒక పురుష ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా ఉంటారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక్కడ నియమించిన సిబ్బందే కాకుండా రాష్ట్ర పరిశీలకులు కూడా వస్తారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయడంతో పాటు పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్యసిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.
మెరుగైన ఫలితాలు సాధిస్తాం..
పరీక్ష విధానంలో మార్పులు..
ఈసారి పరీక్ష విధానంలో ప్రభుత్వం రెండు మార్పులు చేసింది. గతంలో మాదిరి గ్రేడింగ్ విధానం కాకుండా మార్కులను ప్రకటించనుంది. విద్యార్థుల ప్రతిభ వెల్లడి కానుంది. మరొకటి ఆన్సర్ షీట్ విడిగా కాకుండా 24 పేజీలతో కూడిన బుక్‌లెట్ ఇవ్వనున్నారు. ఇది పూర్తయితేనే మరొకటి ఇస్తారు.
విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు