అన్నివర్గాలకు మేలు..
అన్ని వర్గాల సంక్షేమం కోరుకునే విధంగా బడ్జెట్ ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, నీరుపారుదలకు ప్రాముఖ్యత ఇవ్వడం అభినందించదగ్గ విషయం. దీంతోపాటు పర్యాటక రంగానికి కూడా నిధులు కేటాయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉపాధి కోసం రుణాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. – కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి,
ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఈ బడ్జెట్ దూరంగా ఉంది. ఆర్థిక ప్రసంగం, రాజకీయ ప్రసంగంలా ఉంది. గతేడాది కంటే రూ. 13,806 కోట్లు అధికమైనా ఇది ఎవరికి న్యాయం చేయలేని బడ్డెట్. వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఇవ్వడానికి నిధుల కేటాయించలేదు.
– గువ్వల బాలరాజు,
బీఆర్‌ఎస్ జిలా అధ్యక్షుడు
రైతు వ్యతిరేక ప్రభుత్వం..