ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం
జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి వస్తున్న అదనపు కలెక్టర్
దేవసహాయం, డీఈఓ రమేష్‌కుమార్
వెల్దండ జెడ్పీహెచ్‌ఎస్‌లో నంబర్లు
చూసుకుంటున్న విద్యార్థినులు
30 పడకలతో సీహెచ్‌సీ..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టీఏఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా కొనసాగిన చంద్రశేఖర్‌రెడ్డి చొరవతో ఆయన స్వగ్రామమైన ఉప్పునుంతల పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో 30 పడకల సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) స్థాయి పెంచుతూ రూ.5.80 కోట్లతో పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. వాటిలో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.3.80 కోట్లు, పరికరాల కొనుగోలుకు రూ.95 లక్షలు, వైద్యులు, సిబ్బంది జీతభత్యాల కోసం రూ.1.05 కోట్లు వెచ్చించారు. నాలుగేళ్లపాటు సాగదీసి ఆస్పత్రి భవనాన్ని నిర్మించి 2023 అక్టోబర్‌లో ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారు. కానీ, డెంటల్, చిన్నపిల్లలు తదితర అన్ని విభాగాలకు సంబంధించి 7 మంది వైద్యులు ఉండాల్సిన సీహెచ్‌సీలో ఒక్క డాక్టర్‌ను కూడా నియమించలేదు. కేవలం ఇద్దరు స్టాఫ్ నర్సులను నియమించడంతో వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. డెంటల్, ఎక్స్‌రే తదితర అన్ని విభాగాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి. సరిపడా వైద్యులను నియమించపోతే రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మించి.. పరికరాలు సమకూర్చినా.. ఏమాత్రం ఫలితం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు 8లో u
● 28వ రోజుకు చేరిన సహాయక చర్యలు
● డీ–1 పాయింట్ వద్ద ముమ్మరంగా తవ్వకాలు
● కార్మికుల జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు
● అందుబాటులోకి రాని రోబోల సేవలు
– అచ్చంపేట
ఇవీ కేంద్రాలు..
1. ఐఐఆర్‌ఎస్, డెహ్రాడూన్
2. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్,
తిరువనంతపురం
3. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట
4. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్,
బెంగుళూరు
5. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్
6. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్,
హైదరాబాద్
7. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్,
షిల్లాంగ్
నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది.
రేపటి వరకు అవకాశం..
దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు.
ఎంపిక విధానం ఇలా..
ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో సభ్యులుగా ఉండటం, ఆన్‌లైన్ క్విజ్‌లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
వేసవిలో శిక్షణ..
శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.
దరఖాస్తు విధానం..
కార్మికులు ఈ–శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
నాగర్‌కర్నూల్ రూరల్: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ–శ్రామ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎక్స్‌గ్రేషియా అందించడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఆగస్టు 26, 2021 నుంచి మార్చి 31, 2022 మధ్య ఈ–శ్రామ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత రంగ కార్మికుల నామినీలకు కేంద్రం ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తుందన్నారు. మృతిచెందిన కార్మికుల నామినీలకు రూ.2 లక్షలు, అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.లక్ష అందిస్తారన్నారు. జిల్లాలో అర్హులైన అసంఘటిత కార్మికులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీలో
ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదావకాశం
ఆన్‌లైన్‌లో అందుబాటులో
ఇస్రో ప్రత్యేక వెబ్‌సైట్
రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి జిల్లాలో
45,969 మంది విద్యార్థులు
విద్యార్థులను ప్రోత్సహించాలి..
వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.
– భానుప్రకాష్,
జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక