ఏదైనా రోగం వచ్చి ఆస్పత్రికి వెళ్తే అక్కడ పట్టించుకునే వారు లేరు. పేరుకు మాత్రం పెద్ద దవాఖానా కట్టించారు. 15 రోజుల క్రితం మా మనువరాలుకు జ్వరం వచ్చిందని వెళ్తే ఆస్పత్రిలో ఎవరూ లేరు. అక్కడ ఉన్న సిబ్బందిని అడిగినా పట్టించుకోలేదు. ఇక్కరిద్దరు అందులో పనిచేసే సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాలాంటి పేదలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. – రాములమ్మ, ఉప్పునుంతల
●
రిక్రూట్‌మెంట్ లేకనే..
రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో కొత్తగా ఏర్పాటు చేసిన సీహెచ్‌సీల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం చేపట్టలేదు. దీంతో అప్‌గ్రేడ్ అయిన సీహెచ్‌సీలను పీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వం సీహెచ్‌సీలకు కొత్తగా వైద్యులు, సిబ్బందిని నియమిస్తే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది.
– రామకృష్ణ, సీహెచ్‌సీల జిల్లా కోఆర్డినేటర్