వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ
వివరాలు 8లో u
●
ఆదేశాలు వచ్చాయి..
వచ్చే నెల నుంచి జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తాం.
– శ్రీనివాస్, డీఎస్‌ఓ
బియ్యం పక్కదారికి చెక్..
రేషన్ దుకాణాల్లో వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం తీసుకునే చాలామంది లబ్ధిదారులు వాటిని వాడుకోకుండా బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతుంది. వీటిని అమ్ముకోవడంతోపాటు బహిరంగ మార్కెట్‌లో దాదాపు 5 వేలకు పైగా చెల్లించి క్వింటాల్ సన్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు సైతం పేద వారితో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తే పేదలే వాడుకుంటే బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
నాగర్‌కర్నూల్: తెల్లరేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చకచకా చేపడుతోంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు కావాల్సిన సన్నబియ్యం అందుబాటులో లేకపోవడంతో ఈ పథకాన్ని ఇన్నిరోజులు వాయిదా వేసింది. తాజాగా గత సీజన్‌లో రైతులకు సన్నబియ్యంపై రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడం, రైతులు పెద్దఎత్తున సన్న బియ్యం పండించారు. దీంతో వానాకాలం సీజన్‌లో కేంద్రాల ద్వారా ఈ బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత డిసెంబర్‌లో ఈ బియ్యాన్ని కొనుగోలు చేయగా.. ప్రస్తుతం లబ్ధిదారులకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండటంతో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.
ఒక్కరికి 6 కిలోలు..
జిల్లావ్యాప్తంగా మొత్తం 558 రేషన్ దుకాణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం 2,37,833 రేషన్ కార్డులు ఉండగా అందులో 7,50,598 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం ప్రతినెలా 4,861 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు. ఇందులో సాధారణ రేషన్ కార్డులు 2,19,144, అంత్యోదయ కార్డులు 18,652, అన్నపూర్ణ కార్డులు 37 ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో 7 రేషన్ మండల లెవల్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఆహార భద్రత కింద ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం, అంత్యోదయ కార్డుల దారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఉగాది పండుగ కానుకగా
అమలుకు చర్యలు
జిల్లాలో 2.37 లక్షల
కుటుంబాలకు ప్రయోజనం
ప్రతినెల 4 వేల మె.ట., బియ్యం అవసరం
బియ్యం పక్కదారికి అడ్డుకట్ట పడినట్టేనా?