కందనూలు: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని లిటిల్ ప్లవర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల నుంచి నాగర్‌కర్నూల్‌కు చేరుకున్న జవాబు పత్రాలను భద్రపరిచి గదికి తాళం వేసిన సీల్‌ను డీఈఓ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూ ల్యాంకన కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, బెంచీలు, కుర్చీలతోపాటు జవాబు పత్రాల కోడింగ్‌ను పరిశీలించాలన్నారు. మూల్యాంకనానికి వచ్చే ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫ్యాన్లు ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు. డీఈఓ వెంట జిల్లా పరీక్షల నిర్వహణాధికా రి రాజశేఖర్‌రావు, సహాయ అధికారి సత్యనారాయణరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం రాజు తదితరులున్నారు.