
ఐకేపీ వీఓఏల నిర్బంధం ఆపాలి
నాగర్‌కర్నూల్ రూరల్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ఐకేపీ వీఓఏలను అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐకేపీ వీఓఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్బంధాలు విధించడం తగదన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని.. ఐకేపీ వీఓఏలపై ప్రభుత్వం విధిస్తున్న నిర్బంధాలను ఆపాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 20వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు పర్వతాలు, సహాయ కార్యదర్శి రామయ్య, కోశాఽధికారి అశోక్, వీఓఏల సంఘం నాయకులు వెంకటయ్య, మల్లేష్, సునీత, శశిరేఖ, అలివేల, బేగం, రేణుక, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.