
సూరాపూర్‌లో మరో రైతు..
లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్‌కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో స్టార్టర్ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.