విభేదాలు మరోసారి బహిర్గతం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్‌ల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుండగా తాజాగా మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ తిరునగరు భార్గవ్ అధ్యక్షతన జరగాల్సి ఉంది. అయితే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన కౌన్సిలర్లతో పాటు ఒక బీజేపీ కౌన్సిలర్ మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే కాంగ్రెస్‌కి చెందిన మరికొందరు కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి చైర్మన్‌కు వ్యతిరేకంగా దొంగనే.. దొంగా దొంగా.. అంటున్నారు ఇదేం పురపాలన అంటూ ఫ్లకార్డులతో ప్రదర్శనగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే సమావేశం కోరం లేక వాయిదా పడడం గమనార్హం.
ఎమ్మెల్యేను బద్నాం చేస్తున్నారు..
ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఆయన భార్యతోపాటు ఆయన అనుచరుడు మొత్తం 15 ఏళ్ల పాటు మున్సిపల్ ఖాజానాను దోచుకున్నారని ఆరోపించారు. చైర్మనే అక్రమంగా భవనాలు నిర్మించి.. తన హయాంలో సక్రమ, అక్రమ కట్టడాల వివరాలు తెలపాలని ఈనెల 8న ఆర్‌టీఐ పేరుతో కమిషనర్, టీపీఓలకు లేఖ రాయడం హాస్యాస్పందంగా ఉందని ధ్వజమెత్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి అక్రమాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యేను బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పుకుంటున్న చైర్మన్ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోలేదని విమర్శించారు. భార్గవ్‌ను తాము కాంగ్రెస్ పార్టీ నేతగా గుర్తించడం లేదని తేల్చి చెప్పారు. ఫ్లకార్డుల ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి చిలుకూరి బాలు, పొదిల శ్రీనివాస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు బండి యాదగిరిరెడ్డి, రుణాల్‌రెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, కొమ్ము శ్రీనివాస్, వంగాల నిరంజన్‌రెడ్డి, జయలక్ష్మి, అనిత, నాగలక్ష్మి, రామకృష్ణలతో పాటు పలువురు కౌన్సిలర్లు, పార్టీ వివిధ వార్డుల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
ఫ మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకుల్లో
ఆధిపత్యపోరు తారాస్థాయికి..
ఫ మున్సిపల్ కౌన్సిల్‌లో చైర్మన్‌కు
వ్యతిరేకంగా కౌన్సిలర్ల ఫ్లకార్డుల ప్రదర్శన
ఫ కోరం లేక వాయిదా వేసిన సమావేశం
Comments
Please login to add a commentAdd a comment