ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో అదనంగా ఐదు డయాలసిస్ మిషన్లు అందుబాటులోకి తీసుకురావడంతో వాటిని వారు ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మిర్యాలగూడలో మెడికల కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా మిర్యాలగూడ ఎక్కువగా ఇండస్ట్రియల్ ప్రాంతం కాబట్టి స్థానికంగా ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, వైద్యులు కూడా రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. డయాలసిస్ రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే ఆస్పత్రిలో ఉన్న ఐదు డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరో ఐదు మిషన్లు వైద్యారోగ్య శాఖమంత్రితో మాట్లాడి మంజూరు చేయించామని, డయాలసిస్ రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి మాతృనాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరద్, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, పట్టణ నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, స్కైలాబ్‌నాయక్, ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment