పశువులకు సకాలంలో చికిత్స అందించాలి
త్రిపురారం: రైతులు.. తమ పశువులకు సకాలంలో చికిత్స చేయించుకోవాలని లేకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నిడమనూరు మండల కేంద్రంలో పశు సంవర్ధక శాఖ అద్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎదకు రాని 60 గేదెలు, ఆవులకు కృత్రిమ గర్భకోశ విధంగా చికిత్స అందించారు. 50 దూడలకు నట్టల మందులు తాగించారు. అనంతరం పశువులకు అవసరమైన ఉచిత మందులను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ మహిపాల్‌రెడ్డి, గోపాల మిత్రలు బాలరాజు, భిక్షం, నాగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పశు సంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment