గుర్రంపోడు: వేసవిలో పండ్లతోటలకు అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 20 ఏళ్లపాటు దిగుబడులు ఇచ్చే బత్తాయి, నిమ్మలాంటి తోటలు అగ్ని ప్రమాదాలకు గురైతే రైతులు ఆర్థికంగా కోలుకోవడం కష్టమే. ప్రతియేటా వేసవిలో జరుగుతున్న అగ్రిప్రమాదాలతో కాలిన పండ్లతోటలకు నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నా పరిహారం అందిన దాఖలాలు లేవు. ఇటీవల కొప్పోలు గ్రామంలో ఓ రైతు చెత్తను తగలబెట్టేందుకు నిప్పు పెట్టగా వ్యాపించి పక్కనే ఉన్న బత్తాయి తోటలోని 70 చెట్లు కాలిపోయాయి. రైతులు వేసవిలో జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి మురళి వివరించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ మోటార్ల సర్వీస్ వైర్లు, కేబుల్ వైర్లు అతుకులు లేకుండా చూసుకోవాలి. నేల మీద వైర్లు లేకుండా చూసుకోవాలి. వేడిమికి షార్ట్‌సర్క్యూట్‌తో ఎండిన ఆకులు నిప్పంటుకుంటాయి.
ఫ విద్యుత్ సర్వీసు వైర్లు, ఫ్యూజుల నుంచి స్టార్టర్ వరకు గల వైరు నాసిరకంగా ఉంటే లోవోల్టేజీతో వేడెక్కి కాలిపోయి మంటలు అంటుకుని వ్యాపించే అవకాశం ఉంది. – స్టార్టర్ డబ్బాలు నేలపై అడ్డంగా ఉంచడం వల్ల ఎలుకలు దూరి వైర్లు కత్తిరించడం వల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగి పక్కనే గల ఎండు ఆకులకు మంటలు అంటుకుంటాయి.
ఫ తోటల్లో కరెంట్ స్తంభాల మధ్య లూజ్ లైన్ లేకుండా చూసుకోవాలి. లూజ్‌లైన్ల వల్ల గాలిదుమారాలకు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు నేలపైబడి గడ్డి అంటుకునే ప్రమాదం ఉంది.
ఫ తోటల్లో చెట్ల మధ్యలో వేసవికి ముందే దన్నుకోవాలి. కలుపు మందులు వాడితే ఎండిన గడ్డిని పీకేయాలి. వేసవిలో తోటల్లో చెత్తకు నిప్పుపెట్టకూడదు.
ఫ తోటల చుట్టూ జీవకంచె ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అదుపులో ఉండేందుకు కంచె మధ్యలో ఎడం ఉండేలా ఖాళీ స్థలం ఉంచుకోవాలి. తోట గెట్ల వెంట గడ్డి వాములు ఉంచకూడదు.
ఫ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తోటల్లో అంతరకృషి లేకుండా ఎండు గడ్డి బాగా ఉంటే డ్రిప్ లాటరల్ పైపులు కాలిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది.
వేసవిలో పండ్ల తోటలకు పొంచి ఉన్న ముప్పు