కర్నూలు(అగ్రికల్చర్):బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రా హ్మణ, కాపు (బలిజ) కులాలకు చెందిన మహి ళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకీర్‌హుసేన్ తెలిపారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలందరు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన బుధవారం ఒక ప్రకటన లో వెల్లడించారు. శిక్షణ అనంతరం ఉచితంగా కట్టు మిషన్లు కూడా ఇస్తామ ని చెప్పారు. ఆసక్తి గ ల మహిళలు ఈ నెల 22వ తేదీ వరకు సచివాలయాలు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు.
వేటగాళ్ల ఉచ్చుకు దుప్పి బలి
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో వేటగాళ్ల దురాగతాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం బైర్లూటీ రేంజ్‌లోని పెద్దఅనంతాపురం సెక్షన్ అటవీ ప్రాంతంలో ఏకంగా వర్లుపోతుగా పిలిచే ఒక భారీ మగ దుప్పిని ఉచ్చులు వేసి చంపేశారు. సుమారు 60 కేజీలకు పైగానే బరువు ఉండే దుప్పి మాంసాన్ని నిల్వ చేసేందుకు ఎండ బెట్టారు. దుప్పి వధ సమాచారం తెలిసి బుధవారం అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లగా వేటగాళ్ల అక్కడి నుంచి పరారయ్యరు. అటవీ అధికారులు అక్కడ ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకుని దుప్పి వధపై పీఓఆర్ నమోదు చేసి వేటగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను తప్పక అదుపులోకి తీసుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని రేంజర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.