ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. అర్జీలు పరిష్కారం కావడం లేదన్నది అవాస్తవం. ఎన్ని సమస్యలు వచ్చాయి.. ఎన్ని పరిష్కారమయ్యాయి.. రికార్డులో చూస్తే తెలిసిపోతుంది. భూ సమస్యలు కొంత ఆలస్యమైనా పరిష్కరిస్తున్నాం. కొన్ని అర్జీలు మళ్లీ వస్తున్నాయి. వాటి పరిష్కారానికి గడువు 30 రోజులు, 14 రోజుల వరకు ఉంటుంది. ఆ గడువు ముగియకుండానే కొందరు మళ్లీ అర్జీలు ఇస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌లో వస్తున్న సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేసేలా కింది స్థాయి అధికారులను ఆదేశిస్తున్నాం. –జి.రాజకుమారి, జిల్లా కలెక్టర్, నంద్యాల