
శ్రీశైలంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మల్లన్న దర్శనా ర్థం శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మణిశర్మను చూసిన భక్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
సెక్టోరల్ పోస్టుకు
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): జిల్లా సమగ్ర శిక్ష కార్యా లయంలో సెక్టోరల్–1 పోస్టు ఖాళీగా ఉందని, డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త ప్రేమాంతకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో పని చేస్తున్న వారు అర్హులని, 31–03–2025 నాటికి 55 సంవత్సరాల్లోపు వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. విద్యార్హత నకలు పత్రాలతో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24వరకు గడువు ఉందని తెలిపారు.
‘వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి’
నంద్యాల(వ్యవసాయం): వక్ఫ్ సవరణ చట్టా న్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ మైనార్టీ నేతలు, ఇంటెక్సువల్ వింగ్ డిస్ట్రిక్ట్ ప్రసిడెంట్ రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, మౌలానా ఇంతియాజ్ అహ్మద్, షఫీ, హఫీజ్ అబ్దుల్ గఫూర్ అన్నారు. నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు పలకడం ముస్లిం సమాజానికి తీరని ద్రోహం చేయడమేనన్నారు. ముస్లింలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
నేడు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’
నంద్యాల: స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కార్యక్రమం అమలుపై జిల్లా, మండల అధికారులతో శుక్ర వారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్నారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్ర జా ప్రతినిధులను ఆహ్వానించి పాల్గొనేలా చూ డాలన్నారు. జిల్లా అంతటా పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు.

శ్రీశైలంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ

శ్రీశైలంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ