నారాయణపేట: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ అని తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి 20వ తేదీ వరకు నూతన ఓటరు నమోదుకు నారాయణపేట నియోజకవర్గంలో 1,294 దరఖాస్తులు రాగా 1,068 విచారణ పూర్తి చేశారని, చిరునామా మార్పునకు 1529 దరకాస్తులు రాగా.. 1359 విచారణ పూర్తయ్యాయని అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్ తెలిపారు. అలాగే మక్తల్ నియోజకవర్గంలో ఓటరు నమోదుకు 1690 దరఖాస్తులు వచ్చాయని 1269విచారణ పూరయ్యాని, చిరునామా మార్పు కోసం 1908 దరఖాస్తులు రాగా, 1625 విచారణ పూర్తి అయ్యాయన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా తయారుకు రిటర్నింగ్ అధికారి ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఎజెంట్లను నియమించి జాబితా అందచేయాలని సూచించారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, రెండు ఓట్లున్న ఓటర్లను తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల ద్వారా సరైన ఓటరు వివరాలను అందించేందుకు ముందుకు రావాలని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, డిటీ బాల్ రాజ్,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అఖిల ప్రసన్న, రాణి దేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్ రెడ్డి, వినోద్, సలీం, వెంకట్రాంరెడ్డి, అశోక్, అజయ్, వెౌకటేశ్, తాహిర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి
నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ మండలంలోని దంతెన్‌పల్లిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. అలాగే కోస్గిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ చర్చించారు. 22 మంది వేసిన రిట్ పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల కు పరిష్కారం చూపాలన్నారు. భూసేకరణ పనులు, కోస్గి రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.