ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బీజేపీ ఎంపీ | Bjp Mp Jagannath Sarkar Escaped From Death In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీకి స్వల్ప గాయాలు

Feb 14 2021 3:36 PM | Updated on Feb 14 2021 3:52 PM

Bjp Mp Jagannath Sarkar Escaped From Death In Road Accident - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ జగన్నాథ్‌ సర్కార్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు, ఎంపీ  ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఎంపీ అతని బాడీగార్డ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎంపీని అతని బాడీగార్డు అడ్డుపడి మరీ కాపాడినట్లు సమాచారం. శనివారం అర్ధరాత్రి ఎంపీ కోల్‌కతా నుంచి రానాఘడ్‌కు వెళ్తుండగా ఉత్తర 24 పరిగణ జిల్లాలోని బరాసత్‌ హెలబట్ల ప్రాంతంలో వాహనం ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్కును సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement