అహ్మదాబాద్‌లో పుష్పాలతో మోదీ ఫొటో
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి గురువారం ప్రపంచం నలుమూలల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1950 సెప్టెంబర్ 17న మోదీ జన్మించారు. రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యసహా పలువురు ప్రముఖులు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బర్త్‌డే సందర్భంగా బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు చేపట్టాయి. మోదీ ప్రభుత్వం సాధించిన 243 అత్యుత్తమ విజయాలను వివరించే ‘లార్డ్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆవిష్కరించారు. మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, జర్మనీ చాన్సలర్ అంజెలా మెర్కెల్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్.. తదితరులున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వ్యాసాలు, వార్తాకథనాలున్న ‘నరేంద్ర70.ఇన్’ వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి జావదేకర్ ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మోదీకి రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మరింత కాలం సేవ చేసేలా భగవంతుడి ఆశీస్సులు ప్రధానిపై ఉండాలని ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment