సాక్షి, కోల్‌కతా : పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ ఫిబ్రవరి 29న సందేశ్‌ఖాలీ గ్రామంలో దుర్మార్గాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్‌ను పశ్చిమ్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా షాజహాన్ తమ్ముడు షేక్ అలంగీర్‌తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
సందేశ్‌ఖాలీలో ఏం జరిగింది?
24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ గ్రామం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ పెద్ద ఎత్తున రేషన్ కుంబకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, షాజహాన్ షేక్ యథేచ్ఛగా స్థానికుల భూమల కబ్జాకు, దళిత మహిళలపై లైంగిక దాడులు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా రేషన్ కుంబకోణం గురించి సీఎం మమతా బెనర్జీకి తెలిసినా పట్టించుకోలేదంటూ బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు తమ నిరసన గళం విప్పాయి. దీంతో పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయలో జగ్‌దీప్ ధన్‌ఖడ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
2వేల మంది ప్రైవేట్ సైన్యంతో
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో గత ఏడాది రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నించింది. ఆ సమయంలో రెండు వేల మంది షాజహాన్ షేక్ ప్రైవేట్ సైన్యం ఈడీ అధికారులపై కత్తులు, కర్రలతో దాడులు చేయడంతో ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
సీబీఐ అదుపులో షాజహాన్ తమ్ముడు
ఈడీ అధికారులపై జరిగిన దాడిపై షాజహాన్‌ను సీబీఐ అధికారులు విచారించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు ఫిబ్రవరి 29న పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి సీబీఐకి అప్పగించారు. తాజాగా, షాజహాన్ తమ్ముడు షేక్ అలంగీర్‌తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
పార్టీ నుంచి సస్పెండ్
సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment