సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఇస్రో వారి చంద్రయాన్–3 వ్యోమనౌక కక్ష్యను మరోసారి తగ్గించారు. చంద్రుడికి దగ్గరగా 174 కిలోమీటర్లు, దూరంగా 1,437 కిలోమీటర్ల దూరంలో ఉండే దీర్ఘ వృత్తాకార చంద్ర కక్ష్యలోకి చంద్రయాన్–3ని ప్రవేశపెట్టారు. మూడోసారి బుధవారం మధ్యాహ్నం 1.35 గంటలకు కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా ఇస్రో నిర్వహించింది.
బుధవారం బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 12.30 లోపు మరోసారి కక్ష్య దూరాన్ని తగ్గిస్తామని ఇస్రో ప్రకటించింది. కక్ష్య దూరాన్ని తగ్గిస్తూ చివరకు వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి వ్యోమనౌకను తీసుకొస్తారు. ఆ తర్వాత కమాండ్‌ను పంపి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌లను విడదీస్తారు. ల్యాండర్ నెమ్మదిగా చంద్రుడిపై దిగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment