Sonia Gandhi.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రకటనలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం.. రాజకీయ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్‌లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో భారత బలగాలు చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడాన్ని కాంగ్రెస్ అంగీరించదన్నారు. ఈ సందర్భంగానే మోదీ అనుసరిస్తున్న ఫాసిస్టు ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు.
కాగా, కర్నాటకలో బీజేపీ హర్ ఘర్ తిరంగాలో భాగంగా నెహ్రును తొలగించడంపై మండిపడ్డారు. దేశంలో గత సాధించిన విజయాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.
Sonia Gandhi targets PM Modi, says- Government trying to defame Gandhi, Nehru Sonia Gandhi targets PM Narendra Modi government trying to defame Gandhi Nehru Independence Day https://t.co/fDjaRZvqB0 — The Google (@thegoogle93) August 15, 2022
“గత 75 సంవత్సరాలుగా, అత్యంత ప్రతిభావంతులైన భారతీయులు సైన్స్, విద్య, ఆరోగ్యం, సమాచార రంగాలలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. భారతదేశ దార్శనిక నాయకులు స్వేచ్ఛా, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థకు పునాదులు వేశారు. వారు బలమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థల కోసం నిబంధనలను సూచించారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ద్వారా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుందని’’ సోనియా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
Comments
Please login to add a commentAdd a comment