సాక్షి, వేలూరు (తిరువణ్ణామలై): తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని పైవూరు గ్రామానికి చెందిన 38 ఏళ్ల మహిళ.. ఈమె ఈనెల 15న కాంగో దేశం నుంచి భర్త, కుమారుడితో కలిసి చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. ఆ సమయంలో కరోనా పరీక్షలు చేపట్టగా ఆమెకు మాత్రం ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. దీంతో తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, వీధిలో ఉన్న వారికి, బంధువులకు ఈనెల 16వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.
చదవండి: (సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం)
అందులో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్న మహిళ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా పైవూరు గ్రామంలోని 250 మందికి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరోనా పరీక్షలు చేపట్టి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అదేవిధంగా పైవూరు గ్రామంలో భారీగా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇతరులు గ్రామానికి వెళ్లకుండా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రామస్తులకు అవసరమైన అత్యవసర వస్తువులను అధికారులే సరఫరా చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment