
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి వేస్తున్న టీకాల పంపిణీ విస్తృతంగా సాగుతోంది. ప్రపంచంలోనే వేగంగా వ్యాక్సిన్ వేస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా కేసుల పెరుగుదల ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. వైరస్ కట్టడికి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేయగా దాంతో పాటు వ్యాక్సినేషన్ వయసును తగ్గించింది.
ఇకపై 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు అని కేంద్ర హోం మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో కానీ నేరుగా గానీ వ్యాక్సిన్ పొందవచ్చని కేంద్ర మంత్రి పకాశ్ జవదేకర్ తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. 5 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. మార్చి 22వ తేదీ వరకు దేశంలో 4,84,94,594 టీకాలు పంపిణీ చేశారు.
చదవండి: కేంద్రం అలర్ట్.. కరోనా కట్టడికి ‘ట్రిపుల్ టీ’లు
చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
Comments
Please login to add a commentAdd a comment