ఇంకా పెద్దగా వర్షం కురిపించు..ఇంకా పెద్దగా వర్షం రావాలి! | Forest Officer Dances In Joy After Rain Comes To Simlipal | Sakshi
Sakshi News home page

ఇంకా పెద్దగా వర్షం కురిపించు..ఇంకా పెద్దగా వర్షం రావాలి!

Published Sun, Mar 14 2021 6:56 PM | Last Updated on Mon, Mar 15 2021 1:24 PM

Forest Officer Dances In Joy After Rain Comes To Simlipal - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలోని సిమ్లిపాల్‌ అడవిలో కార్చిచ్చురాసుకుంది. దీని వలన రెండు వారాలుగా అడవంతా మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ మంటలను అదుపు చెయ్యడానికి ఫారెస్టు అధికారులు ఫైరింజన్‌లతో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మానవ ప్రయత్నానికి దేవుడికి కూడా తన వంతుగా సహయం చేయాలనిపించిందో ఏమో గానీ.. ఒక్కసారిగా పెద్ద జడివాన కురిపించాడు. అయితే ఈ అనుకోని సంఘటనతో మంటలను ఆర్పుతున్న ఒడిశాకు చెందిన స్నేహదల్‌ అనే మహిళా అటవీ అధికారి ఆనందంతో​ పరవశించి పోయారు. అంతటితో ఆగకుండా ‘ ఇంకా పెద్దగా వర్షం కురిపించు..ఇంకా పెద్దగా వర్షం రావాలి’ అంటూ గట్టిగా అరుస్తు చిన్న పిల్లలా అటూ ఇటూ పరుగెత్తడం మొదలు పెట్టారు.  

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతొంది. కాగా, దీనిని సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేష్‌ పాండే  షేర్‌ చేశారు.  అయితే,  దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కష్టానికి దేవుడు కూడా సహకారం అందించాడు. మీ బృందానికి హ్యట్సాఫ్‌ ’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ మంటల్లో ఎవరు ప్రాణాలు కోల్పోలేదని, మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిందని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. 

చదవండి: వైరల్‌: ఆకలేస్తే అంతేమరీ! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement