
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధి కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తంచేశారు. దోమకాటుతో ప్రభలే ఈ వ్యాధి కారణంగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఇప్పటికే 1,530 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయి. గత నాలుగేళ్లలో ఢిల్లీలో ఇంత ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన సంబంధిత వైద్య అధికారులతో మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మన్‌సుఖ్ మాట్లాడారు. కేసులు ఎక్కువ అవుతోన్న రాష్ట్రాలను గుర్తించి, ఆయా రాష్ట్రాలకు సంబంధిత నిపుణులను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు సూచించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందనుందని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment