
కరోనా చికిత్సకు ఆస్పత్రిలో చేరిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చిందని అమిత్ షా ఆదివారం ట్వీట్ చేశారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందన్న అమిత్ షా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరానని తెలిపారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు అమిత్ షా.
ఇక భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 17.5 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 54,736కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 17,50,724కి చేరింది. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 37,364కు చేరింది.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Amit Shah (@AmitShah) August 2, 2020