తిరువనంతపురం : కేరళ ఆర్థికమంత్రి డాక్టర్ థామస్ ఐస్సాక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఇప్పటివరకు కేరళ కేబినెట్‌లో కరోనా బారిన పడ్డ మొదటి మంత్రి థామసేనని సమాచారం. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో గతకొన్ని రోజులుగా తనను కలిసిన వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని, లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం మంత్రి థామస్‌ను తిరువనంతపురపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక గత 24 గంటల్లో కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే అత్యధికంగా 3,082 కొత్త కరోనా కేసులు బయటపడగా 10 మంది మరణించారు. ఇప్పటిరవరకు రాష్ర్టంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 87,841కు చేరింది. (కేశవానంద భారతి కన్నుమూత..)
Comments
Please login to add a commentAdd a comment