
భోపాల్ : ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్‌బారినపడగా.. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహన్కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా దేశంలో కరోనా బారినపడిన తొలి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment