
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ఆదివారం 233 మందితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 1,00,130 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 12,557 మంది కరోనా బారిన పడటంతో మొత్తం కేసుల సంఖ్య 58,31,781కు చేరింది. తాజాగా 14,433 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 55,43,267కు పెరిగింది.
రికవరీ రేటు 95.05 శాతం, మరణాల రేటు 1.72 శాతంగా ఉంది. రాష్ట్రంలో 1,85,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో చేసిన 2,37,514 పరీక్షలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3,65,08,967 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ముంబైలో 786 కేసులు
ముంబైలో కొత్తగా 786 కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. ముంబై డివిజన్‌లో తాజాగా 2,420 మంది కరోనా బారిన పడగా 33 మంది మృతిచెందారు. నాసిక్ డివిజన్‌లో 1,194, పుణే డివిజన్‌లో 2,999, కొల్హాపూర్ డివిజన్‌లో 3,864, ఔరంగాబాద్ డివిజన్‌లో 373, లాతూర్ డివిజన్‌లో 570, అకోలా డివిజన్‌లో 718, నాగ్‌పూర్ డివిజన్‌లో 419 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment