ఢిల్లీ: మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులో సంస్థ యజమానులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హైకోర్ట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలతో కూడా ధర్మాసనం విచారణ జరపనుంది.
కాగా, గత విచారణ సందర్భంగా ఆర్టికల్ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వివరించారు. ఈ అంశంపై ఎగ్జామిన్ చేస్తామన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నేటికి(జులై 18కి) వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది.
Comments
Please login to add a commentAdd a comment