
ముంబై: కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పొయి వీధినపడ్డారు. అలాగే ముంబైకి చెందిన సుభాన్ కుటుంబం కూడా కరోనా కారణంగా ఉపాధిని పొగొట్టుకుంది. బతకడం భారంగా మారింది. దీంతో 14 ఏళ్ల వయసులో సుభాన్ తన వారిని పోషిండం కోసం తన చెల్లెలికి ఆన్‌లైన్ క్లాసులు చెప్పించడం కోసం టీ అమ్మడం మొదలు పెట్టాడు. టీ షాపు కూడా లేకపోవడంతో ఇంట్లో టీ తయారు చేసి వీధి వీధి తిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు.
ఈ విషయం గురించి సుభాన్ మాట్లాడుతూ, 12 ఏళ్ల క్రితమే తన తండ్రి మరణించాడని, అప్పటి నుంచి తన తల్లి బస్సు అటెండర్‌గా పనిచేస్తూ తమని పోషిస్తుందని తెలిపాడు. లాక్‌డౌన్ కారణంగా స్కూల్స్ మూతబడటంతో తన తల్లి ఉపాధి కోల్పోయిందని దాంతో ఆర్థికంగా కష్టాలను ఎదర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే టీ అమ్ముతున్నానని, దీని ద్వారా రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వస్తున్నాయని చెప్పాడు. వాటిని తన తల్లికి ఇస్తున్నానని తెలిపాడు. తన చెల్లెళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా చదువుకుంటున్నారని, స్కూల్ తెరవగానే తను కూడా స్కూల్‌కి వెళతానని తెలిపాడు. చదువుకోవాల్సిన చిన్న వయసులో సుభాన్ ఇలా కష్టపడటం చూసి గుండెలు బరువెక్కుతున్నాయి. చదవండి: రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment