మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం | New Criminal Laws Passed In Lok Sabha | Sakshi
Sakshi News home page

మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Published Wed, Dec 20 2023 5:13 PM | Last Updated on Wed, Dec 20 2023 5:25 PM

New Criminal Laws Passed In Lok Sabha - Sakshi

సాక్షి, ఢిల్లీ: భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలంనాటి  ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రేపు రాజ్యసభలో ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. 

అంతకుముందు లోక్‌సభలో అమిత్‌ షా మూడు బిల్లులకు సంబంధించి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ఈ బిల్లులు న్యాయం చేయడానికి తప్ప, శిక్షించడానికి కాదు. వేగంగా న్యాయం చేయడానికి ఈ బిల్లులు తీసుకొచ్చాం. డిజిటల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సైతం సాక్ష్యంగా పరిగణనలోకి  తీసుకొచ్చామని అన్నారు. వందేళ్ల వరకు ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయి. 

ఈ బిల్లుల ప్రకారం యాక్సిడెంట్ చేసి పారిపోతే పదేళ్ల జైలు శిక్ష 
యాక్సిడెంట్‌లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేరిస్తే శిక్ష సగానికి తగ్గింపు 
మూక దాడికి ఉరిశిక్ష, ఏడేళ్ళ జైలు శిక్ష
గత చట్టాలు 150 ఏళ్ళ క్రితం నాటివి

 

మైనర్‌పై గ్యాంగ్ రేప్ చేస్తే జీవితకాల శిక్ష 
మైనర్ చనిపోతే నిందితులకు ఉరిశిక్ష
దేశద్రోహానికి జీవితకాల శిక్ష నుంచి 7 ఏళ్లకు మార్పు 
నేరం చేసి వేరే దేశానికి పారిపోయిన వారు 90 రోజుల్లో కోర్టు ముందు లొంగిపోవాలి
లేదంటే వారి తరఫున ప్రభుత్వ న్యాయావాదిని పెట్టి తీర్పును ప్రకటిస్తాము
అలాంటి నేరస్తులను విదేశాలనుంచి తీసుకొచ్చి ఉరి తీస్తాం. 

మహిళలకు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే అవకాశం
అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం ఇవ్వాలి దర్యాప్తు, సోదాల్లో వీడియోగ్రఫీ చేయాలి.
ఎవరైనా ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు.
24 గంటల్లో దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు మార్చుకోవచ్చు.

నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌లో పెట్టుకోవడానికి వీలు లేదు
అరెస్ట్ అయిన వారి కేసు వివరాలు వారు కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ప్రతి పోలీస్టేషన్‌లో ఒక అధికారి నియామకం
ఆర్ధిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మల్లిస్తాం
నేరం సందర్భంగా పట్టుకున్న వాహనాలను కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలని నిర్ణయం
పోలీస్‌ స్టేషన్స్ ఆధునీకరణ చేయాలని నిర్ణయం
ఏడేళ్ల జైలుశిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ టీమ్స్ దర్యాప్తు తప్పనిసరి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement