న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరోనాను ఓడించడానికి ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ, మంత్రులు కోరారు. రానున్న పండుగల సీజన్, శీతాకాలం, అన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనాందోళన్ పేరుతో ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రజలే కేంద్రంగా నడుస్తుందని మోదీ అన్నారు. దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చినప్పుడే కోవిడ్ లాంటి మహమ్మారిపై పోరాడగలుగుతామని హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ‘యునైట్ 2 ఫైట్ కరోనా’హ్యష్‌టాగ్‌తో ఈ వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి మన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment