ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన కోల్‌కతాలోని కరోనా టెస్టింగ్ సెంటర్
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటం విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నోయిడా, ముంబై, కోల్‌కతాలో కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలను ఆయన సోమవారం ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనవరిలో దేశంలో కరోనా టెస్టులు జరిపేందుకు ఒకే సెంటర్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,300కు చేరిందని ప్రధాని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్య రోజుకు 5 లక్షలకు పెరిగిందని చెప్పారు. నోయిడా, ముంబై, కోల్‌కతాల్లో ప్రారంభిస్తున్న ఈ టెస్టింగ్ సెంటర్లలో రోజుకు 10 వేలకు పైగా శాంపిళ్లను పరీక్షించగలవని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment