
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారితో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండగా, వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి గడువు లేదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహమ్మారి రోజుకోరకంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమం పూర్తికి ప్రస్తుతానికి ఎలాంటి గడువు లేదంటూ శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన ట్విట్టర్‌లో శనివారం స్పందించారు. ‘ఒక వైపు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉండగా, ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ పూర్తికి గడువు లేదని ఒప్పుకుంది. ప్రభుత్వం చేతకాని తనానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.