జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ హాస్పిటల్‌లో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మతో కలిసి ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌ను వేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కరోనా వ్యాక్సిన్ సురక్షితమైందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. నిర్దేశించిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టీకాను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీకా వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవన్నారు.
రాజస్తాన్‌లో వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని సీఎం అన్నారు. ప్రతిరోజూ దాదాపు 2 లక్షల మంది టీకాను తీసుకుంటున్నారని, ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకం అని చ్పెపారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నందున చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం వంటి నియమాలు పాటించడంలో నిర్లక్షంగా ఉండరాదని తెలిపారు. అలానే కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని పేర్కొన్నారు.
చదవండి : (వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : నీతా అంబానీ)
(కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సీనియర్ నటి)
Watch | Rajasthan Chief Minister Ashok Gehlot the first dose of #COVID19Vaccine at SMS Hospital in Jaipur
— NDTV (@ndtv) March 5, 2021
(Video tweeted by @ashokgehlot51) pic.twitter.com/gCfoPoeMce
Comments
Please login to add a commentAdd a comment