ఢిల్లీ : తాను అస్వస్థతకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు.
సోమవారం ఉదయం నుంచి రతన్ టాటా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం.. రతన్ టాటా రక్తపోటు తగ్గడంతో ఆదివారం అర్థరాత్రి 12:30 నుండి 1:00 గంటల మధ్య టాటాను ఆయన కుటుంబ సభ్యులు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని జాతీయ మీడియా కథనాలు, ట్వీట్‌లు వెలుగులోకి వచ్చాయి.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024
ఆస్పత్రికి వచ్చిన వెంటనే టాటాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారని,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్‌వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఈ తరుణంలో ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని రతన్ టాటా ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. దీంతో టాటా ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment