Social media active users reach 500 crore across world - Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా యాక్టివ్‌ యూజర్లు 500 కోట్లు

Published Sat, Jul 22 2023 6:21 AM | Last Updated on Sat, Jul 22 2023 11:56 AM

Social media active users reach 500 crore across world

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంటే ప్రపంచ జనాభాలో 64% మంది సామాజిక మాధ్యమాల్లో అత్యధికంగా కాలం గడుపుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే వినియోగదారులు 3.7% పెరిగినట్టు డిజిటల్‌ అడ్వయిజరీ సంస్థ కెపియోస్‌ అధ్యయనంలో వెల్లడైంది.

► తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతీ 11 మందిలో ఒక్కరికే సోషల్‌ మీడియాలో ఖాతాలున్నాయి.
► భారత్‌లో ప్రతీ ముగ్గురిలో ఒకరు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నారు
► రోజుకి సగటున 2 గంటల 26 నిమిషాలు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు
► బ్రెజిల్‌ వాసులు అత్యధికంగా సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్‌ మీడియాలో ఉంటే, జపాన్‌ వాసులు అత్యంత తక్కువగా గంటలోపు మాత్రమే సోషల్‌ మీడియాని చూస్తున్నారు.
► సోషల్‌ మీడియా యూజర్లకి దాదాపుగా ఏడు యాప్స్‌లో ఖాతాలుంటు న్నాయి. వీటిలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ ప్రధానమైనవి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement