న్యూఢిల్లీ: సందేశ్‌ఖాలీ ఘర్షణల అంశంలో తమ ముందు హాజరు కావాలని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ(సీఎస్), డీజీపీలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది.
పశ్చిమబెంగాల్ సందేశ్‌ఖాలీలో జరిగిన పరిణామాలపై ఆందోళన చేపట్టిన బీజేపీ ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై ఎంపీ సుకాంత మజుందార్ రాష్ట్ర సీఎస్, డీజీపీలపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ పశ్చిమ బెంగాల్ సీఎస్ భగవతి ప్రసాద్ గోపాలిక, డీజిపీ రాజీవ్‌కుమార్‌లను సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తుపై కోర్టు స్టే ఇచ్చింది.
కాగా, టీఎంసీ నేత షాజహాన్‌షేక్, ఆయన అనుచరులు తమ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత వాసులు ఇటీవల ఆందోళనలకు దిగారు. దీనిపై బీజేపీ ఎంపీలు సందేశ్‌ఖాలీకి వెళ్లి మహిళలను పరామర్శించడానికి యత్నంచినపుడు పోలీసులకు వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎంపీ సుకాంత గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఉదంతంపై ఆయన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment