న్యూఢిల్లీ: సాధారణ ప్రజలకు 2020–21 ఏడాది మధ్య నాటికి కూడా సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో నిమగ్నమైన కొందరు నిష్ణాతులు చెప్పారు. కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు, 2020 జూన్ చివరలో టీకా తయారీ రంగంలో పనిచేస్తున్న 28 మంది పరిశోధకులపై ఒక సర్వే నిర్వహించారు. (చదవండి: గుడ్‌న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్)
అమెరికా చెపుతున్నట్టు 2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వీరిలో చాలా మంది చెప్పారని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జొనాథన్ కిమ్మెల్మాన్ అన్నారు. కనీసం 2022 నాటికైనా అందుబాటులోకి వస్తే అది గొప్ప విషయమేననీ, సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ముందు, వ్యాక్సిన్ తయారీలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. (చదవండి: వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా?)
Comments
Please login to add a commentAdd a comment